తప్పైంది మన్నించండి – కొలుసు
మంత్రి పార్థసారథి కామెంట్స్
అమరావతి – ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్బంగా చోటు చేసుకున్న సంఘటనకు తాను చింతిస్తున్నానని అన్నారు. ఈ సందర్బంగా తనను మన్నించాలని కోరారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విగ్రహావిష్కరణలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనకు ఇచ్చిన గౌరవాన్ని ఎన్నడూ మరిచి పోలేనని అన్నారు. తనను ఆదరించిన నేతలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నందుకు మన్నించమని కోరుతున్నానని తెలిపారు పార్థసారథి.
ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించాలని అనుకున్నారని, అందుకే జోగి రమేష్ కూడా వచ్చి ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల నుంచి కార్యక్రమ ఏర్పాట్ల వరకు టీడీపీకి గానీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు గానీ, ఎటువంటి ప్రమేయం లేదని మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో కేవలం గౌడ సంఘానికి సంబంధించిన వారు మాత్రమే నిర్ణయించారని తెలిపారు.
తనకు జోగి రమేష్ కు వ్యక్తిగతమైన బలమైన సంబంధాలు ఏవీ లేవన్నారు. గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను ఇబ్బంది పెట్టిన ఘటనలు చాలా ఉన్నాయని వాపోయారు. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని మరోసారి మనవి చేస్తున్నానని చెప్పారు కొలుసు పార్థసారథి.