ఏపీలో మరో సైబరాబాద్ నిర్మాణం
మంత్రి పార్థసారథి కామెంట్స్
అమరావతి – వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు మంత్రి పార్థసారథి. గత ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు… పోలవరం నిర్మించకుండా నాశనం చేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని వాపోయారు. రైతుల ధాన్యంకి డబ్బులు మేం వచ్చాక చెల్లించామన్నారు మంత్రి పార్థసారథి. ఏపీలో మరో సైబరాబాద్ నిర్మించేందుకు తమ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్దే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. కానీ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు.
కానీ పనిగట్టుకుని నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు. తప్పులు చేసింది చాలక ఇతరులపై నిందలు మోపాలని అనుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పార్థసారథి.