జనాన్ని జలగలా పీల్చేసిన జగన్
నిప్పులు చెరిగిన మంత్రి పార్థసారథి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లావడారు. జనాన్ని జలగలా పీల్చేశాడని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మనోడిదేనంటూ మండిపడ్డారు.
ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేశాడని, ఐదేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించాడని అందుకే జనం ఛీ కొట్టారని , కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు కొలను పార్థసారథి. పంచ భూతాలను కూడా వదలలేదని అన్నారు.
వేల కోట్లు దోచుకున్నాడని, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాడని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని, వాటిని తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలనా పరంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని, దీనిని గట్టెక్కించాలంటే కనీసం రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్లు కావాల్సి వస్తుందని, అందుకే సీఎం నారా చంద్రబాబు నాయుడు పీఎంను కలిసి విన్నవించారని తెలిపారు పార్థసారథి.