మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అన్నింటిని పూర్తి చేశామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పినవే కాకుండా చెప్పని హామీల అమలు కూడా జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను తీర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి కేవలం రెండేసార్లు వచ్చాడని, ఈ 15 నెలల కాలంలో ఆయన దాదాపు 57 లక్షలకు పైగా వేతనం రూపేణా తీసుకున్నాడని ఆరోపించారు. కానీ ఆయన శాసన సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. నిజాలు ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాడని , ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదన్నారు.
అంతకు ముందు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు, రూ.5.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు, రూ.45.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో 100 పడకల ఆస్పత్రికి, రూ.26 కోట్లతో ఘన్‌ఫూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు.