ఎస్పీ ఎక్కడ అంటూ ఆగ్రహం
కరీంనగర్ జిల్లా – కరీంనగర్ జిల్లాలో శుక్రవారం అధికారికంగా పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. పదే పదే తోసేయడం పట్ల మండిపడ్డారు. మహిళా కలెక్టర్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అంటూ నిప్పులు చెరిగారు. అసలు ఉండాల్సిన ఎస్పీ ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు కలెక్టర్.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా హాజరయ్యారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా కొనసాగుతున్నాయి.
చాలా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ప్రజలు. తమకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాంటూ నిలదీస్తున్నారు. ఇచ్చిన ఆరు హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. దీంతో భారీ ఎత్తున సెక్యూరిటీ మధ్యన సభలు నిర్వహిస్తుండడం విశేషం.