కేటీఆర్ నిరూపిస్తే రాజీనామా చేస్తా
కుంభకోణంపై పొంగులేటి సవాల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై, ఆయన బావమరిది సూదిని సృజన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోయే అమృత్ స్కీమ్ కు సంబంధించి చోటు చేసుకున్న టెండర్ల వ్యవహారంపై చేసిన ఆరోపణలు సత్య దూరమని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
అమృత్ స్కీమ్ లో రూ. 8,888 కోట్ల స్కామ్ చోటు చేసుకుందని కేటీఆర్ చెప్పడం దారుణమన్నారు. ఆయన చేసిన అభియోగం పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. మీరు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
తాను చేసిన సవాల్ ను కేటీఆర్ స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉండాలని పేర్కొన్నారు.