దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్
ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహిళలకు ఖుష్ కబర్ చెప్పారు ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మహిళలకు తీపి కబురు చెప్పారు.
తాము చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత గ్యాస్ అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు పొంగూరు నారాయణ. ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు.
టిడ్కో ఇళ్లకు రంగులేసి జగన్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వ లేదని ఆరోపించారు పొంగూరు నారాయణ. గతంలో అన్న క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని. అయినా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి నారాయణ.