బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
సీఎం ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ
అమరావతి – ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా మరో వైపు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. విజయవాడ నగరంతో పాటు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకు పోయాయి.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు ప్రస్తుత పరిస్థితిపై. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో చిక్కుకు పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా విజయవాడ 5వ డివిజన్ సున్నపు బట్టీల సెంటర్ లో కొండ చర్యలు విరిగిపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్ లో పరామర్శించారు ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.
పరామర్శించిన అనంతరం మరణించిన వారి కుటుంబ సభ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు.