స్పష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ప్రపంచం విస్తు పోయేలా, ఎక్కడా లేని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు
మంత్రి పొంగూరు నారాయణ. నేలపాడు సమీపంలోనీ అడ్మినిస్ట్రేటివ్ టవర్లు,హై కోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛంధంగా ఇచ్చారని తెలిపారు. చాలా మందికి నష్ట పరిహారం చెల్లించామని, ఇంకా కొందరికి చెల్లించాల్సి ఉందన్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కడతామన్నారు.
2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే భారీ ఎత్తున స్పందన వచ్చిందన్నారు మంత్రి నారాయణ. ప్రపంచంలో టాప్ 5 లో ఒకటి గా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని చెప్పారు.
అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించామన్నారు. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసిందన్నారు. అసెంబ్లీనీ 250 మీటర్ల ఎత్తులో నిర్మించి….మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేశామని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.
రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్ లు డిజైన్ చేశామన్నారు.
కోటీ 3 వేల చదరపు అడుగుల తో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించామని తెలిపారు.