ఏపీ ఇసుక పాలసీ భేష్ – నారాయణ
అందరికీ మేలు చేకూర్చేలా నిర్ణయం
అమరావతి – ఏపీ పురపాలిక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఉచిత ఇసుక పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు .
సోమవారం నెల్లూరు సిటీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, బోడి గాడి తోట, గాంధీ గిరిజన కాలనీ, పొర్లుకట్ట ప్రాంతాల ఇసుక రీచులను అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు మంత్రి పొంగూరు నారాయణ.
నెల్లూరు సిటీ పరిధిలో నాలుగు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశామన్నారు మంత్రి .దీంతో రిచ్ ల వద్ద రద్దీ తగ్గనుందన్నారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చామని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ. టాక్స్ లు తీసేసి ఎవరైనా ఎడ్ల బండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి మానటరింగ్ కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాలకు ఇవ్వాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడం జరిగిందని అన్నారు . రీచ్‌లలో మిషన్లు పెట్ట కూడదు పొరపాటున పెడితే వాటిని పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.