మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో పార్టీ నగరడివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలతో సమీక్ష చేపట్టారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే వారికే పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐదు దేవాలయాల కమిటీ చైర్మన్లు, పాలకమండలి సభ్యుల ఎంపికపై చర్చించామన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, పారదర్శకంగా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాలకు చోటు దక్కుతుందని, ప్రత్యేకించి మహిళలకు ఛాన్స్ ఇస్తామన్నారు.
ఏ ఒక్క కులానికి ప్రయారిటీ ఇవ్వడం అంటూ ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. అన్ని కులాలు నాకు సమానమేనని చెప్పారు. పదవుల కేటాయింపుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానంటూ ప్రకటించారు వేదిక మీద నుంచి. .పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా మంచి పదవులే వస్తాయని అన్నారు మంత్రి. కాగా పదవులు పొందిన వారు బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ప్రజలు మనపై నమ్మకం ఉంచి గెలిపించారని, వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు నేతలు, కార్యకర్తలు, పదవులు పొందిన వారు కృషి చేయాలన్నారు. ఇదే సమయంలో పదవులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పొంగూరు నారాయణ.