12 లక్షల ఫుడ్ ..వాటర్ ప్యాకెట్లు పంపిణీ
ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ – ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామన్నారు.
నగరంలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం చేశామన్నారు. చాలా చోట్ల నేవీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియం కు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్ లు,వాటర్ ప్యాకెట్లు చేరుకున్నట్లు చెప్పారు.
నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని పరిశీలించానని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే 2 ప్యాకెట్ల ఆహారం ఉదయం టిఫిన్ కోసం పంపించామన్నారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు అందించడం జరిగిందన్నారు.
గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, రాజహేంద్రవరం మున్సిపాలిటీల తో పాటు హరే కృష్ణ మూవ్ మెంట్, పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధ్యతలు అప్పగించామన్నారు పొంగూరు నారాయణ.
మొత్తం 6 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు రెడీగా ఉంచామన్నారు.