రాజధాని అమరావతికి పూర్వ వైభవం
మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
అమరావతి – రాష్ట్ర రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకు వస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ డైరీని ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మేల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తాము వచ్చాక ఏపీని అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి ఊపు తీసుకు వస్తామన్నారు.
గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉందో అందరికీ తెలుసు అన్నారు. మూడు ముక్కలాటతో అమరావతిని గత పాలకులు నాశనం చేశారని ఆరోపించారు. రెండో సారి సీఎం తనకు మళ్ళీ పురపాలక శాఖ అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారని చెప్పారు డాక్టర్ పొంగూరు నారాయణ.
భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతులకు సంబఃధించి ఈ నెలాఖరు వరకు కీలక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 500 మీటర్లు కంటే పైన నిర్మాణాలు చేసే భవనాలు కు సెల్లార్ అనుమతులు ఇస్తున్నామన్నారు. లే అవుట్ లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లు ఉండగా వాటిని 9 మీటర్లకు తగ్గించామన్నారు.