15 లోగా పనులు పూర్తి చేయాలి – మంత్రి
అధికారులను ఆదేశించిన నారాయణ
అమరావతి – ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు. మంగళగిరి ఎయిమ్స్ సిబ్బంది,పేషెంట్ లకు శుద్ధమైన తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందన్నారు.
ఇప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని , ఇతర అవసరాలకు గుంటూరు ఛానెల్, ఆత్మకూరు చెరువు నుంచి సరఫరా చేస్తున్నారని చెప్పారు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఇప్పుడు ప్రతి రోజూ 25 లక్షల లీటర్ల తాగు నీరు అందించేలా 8 కోట్లతో ఫిల్టర్ బెడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టామన్నారు.
పనుల ప్రగతిని పరిశీలించారు మంత్రి. ఈ సందర్బంగా సంబంధిత అధికారులు పనులు ఈనెల 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.