ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్క ఉంది
వైఎస్ జగన్ రెడ్డిపై నారాయణ ఫైర్
అమరావతి – రాష్ట్రంలో వరద బాధిత ప్రభావిత ప్రాంతాలలో తాము ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్క రెడీగా ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. బుధవవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు కేబినెట్ సబ్ కమిటీ మంత్రుల మీటింగ్ జరిగింది.
తన స్వంత పత్రికలో ఏం రాస్తున్నారో కూడా జగన్ కు తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి. ప్రభుత్వం మొత్తం 601 కోట్లు ఖర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జరుగుతుందని నారాయణ ప్రశ్నించారు జగన్ రెడ్డి.
ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్లిన జగన్ కు వాస్తవాలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి నీళ్లలో తిరిగారు..మునిగిన ఇళ్లకు వెళ్లారు..స్వయంగా పరికరాలు డ్యామేజిని పరిశీలించారని చెప్పారు.
చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి సాయం చేశారని, కోట్లు కొట్టేశారంటూ ఫేక్ ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించచారు. ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు జిల్లా నిధుల నుంచి ఖర్చు పెట్టారని తెలిపారు పొంగూరు నారాయణ.
విశాఖ హుద్ హుద్ తుపానుకు విజయవాడ వరదలకు చాలా తేడా ఉందన్నారు. విజయవాడ వరదల్లో కొన్ని చోట్ల నాలుగు రోజులు జనం నీటిలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఒక్క విజయవాడ వరదల్లో 30 లక్షల వాటర్ ప్యాకెట్లు సరఫరా చేసాశామన్నారు.
ప్రజలకు నీరు లేక పోవడంతో తాము సరఫరా చేసిన వాటర్ బాటిల్స్ ను టాయిలెట్స్ కు కూడా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. మొత్తం ఖర్చు రూ. 93.5 కోట్లు అయ్యిందన్నారు పొంగూరు నారాయణ.
బాధితులకు అవసరమైన భోజనాన్ని అప్పటికప్పుడు ఇతర జిల్లాల నుంచి తెప్పించామన్నారు. విజయవాడ వరదల్లో చంద్రబాబు చేసిన సాయాన్ని ప్రజలంతా మెచ్చుకుంటున్నారని అన్నారు.
వరదల్లో పదివేల మంది మున్సిపల్ సిబ్బంది రాత్రీ పగలు పని చేశారని చెప్పారు నారాయణ. ఇతర జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఇళ్లను శుభ్రం చేయించామన్నారు. వరద బాధితులకు 4 లక్షల 6 వేల కుటుంబాలకు 601 కోట్లు పరిహారం అందించామని ప్రకటించారు. జగన్ ఇలానే చేస్తే రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా రాదని హెచ్చరించారు.