NEWSANDHRA PRADESH

ముంపు ప్రాంతాల‌లో ప‌ర్య‌టించిన నారాయ‌ణ

Share it with your family & friends

నూజివీడు రోడ్డులో కొన‌సాగుతున్న వ‌ర‌ద నీరు

విజయవాడ – ఏపీలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఏపీ సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ గ‌త కొన్ని రోజుల నుంచి ముంపు ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేలా ఫోక‌స్ పెట్టారు.

మంగ‌ళ‌వారం వరద ముంపున‌కు గురైన‌ ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి పొంగూరు నారాయణ. కుందా వారి ఖండ్రిక, నున్న , నూజివీడు రోడ్డులో ఇప్పటికీ వరద నీరు కొన‌సాగుత‌తోంది.

రోడ్లు, ఇళ్ల మధ్యలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపించి వేస్తున్న పనులను పరిశీలించారు నారాయ‌ణ‌.

నున్న రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల మధ్య నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు భారీ మోటార్ల ఏర్పాటు చేశారు. ఇదే స‌మ‌యంలో రోడ్లకు గండ్లు కొట్టారు మున్సిప‌ల్ స‌హాయ‌క సిబ్బంది.

ప్రోక్లేయిన్ లు, భారీ యంత్రాలతో వరద నీటి తరలింపు కోసం జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించారు పొంగూరు నారాయ‌ణ‌.

ప్రతి రోజూ మూడు సార్లు క్షేత్ర పర్యటనల ద్వారా సహాయక చర్యల్లో అధికారులను పరుగులు పెట్టిస్తుండ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

ఖండ్రిక చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉందన్నారు. ఈ సాయంత్రం లోగా నీటిని పూర్తిగా బయటకు తరలించేలా భారీ ఏర్పాట్లు చేశామ‌న్నారు.

రాత్రి నుంచి త‌న‌తో పాటు అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నామ‌ని తెలిపారు. సాయంత్రానికి నీరు పూర్తిగా తగ్గుతుందన్నారు.

వరద నీరు తగ్గగానే పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు పొంగూరు నారాయ‌ణ‌.ఇప్పటికే వరద నష్టం అంచనాల ప్రక్రియ కూడా జ‌రుగుతోంద‌ని చెప్పారు.

నష్టం పై నివేదిక సిద్ధం కాగానే ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలనేది సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇప్పటివ రకూ లక్షా 75 వేల మందికి నిత్యావసర సరుకులు అందించామ‌ని స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌.