మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడి
హైదరాబాద్ – టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సంస్థలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, ఇతర సిబ్బందికి 2.5 శాతం చొప్పున డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కరువు భత్యం ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీ సంస్థపై రూ. 3.6 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ప్రకటించారు. మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి.
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి గా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ లోకి తీసుకోనున్నట్లు చెప్పారు.
తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు పొన్నం ప్రభాకర్.