సంక్షేమంపై సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం , అభివృద్దిపై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు .
ఇదిలా ఉండగా హుస్నాబాద్ నియోజకవర్గం లోని భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. పంచాయతీరాజ్ రోడ్డు నుండి భీమదేవరపల్లి వరకు రూ. 5 కోట్ల నిధులతో రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు.
గ్రామీణ నీటి సరఫరా ఆధ్వర్యంలోని మిషన్ భగీరథ విభాగం లోని భీమదేవరపల్లి మండలం లో పనులకు రూ. 35 లక్షల తో పీడబ్ల్యూఎస్ పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి. మొత్తం 6 పనులకు ఓపెన్ జిమ్ లకు 30 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
అనంతరం అర్హులైన మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.