బీఆర్ఎస్ రాజకీయం పొన్నం ఆగ్రహం
కేటీఆర్..హరీశ్ రావులకు పనేం లేదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని, కావాలని జనాలను కేటీఆర్, హరీశ్ రావు రెచ్చ గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు పొన్నం.
సోషల్ మీడియా వేదికగా తమపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. చర్యలు తప్పవంటూ హెచ్చరించారు . ప్రజలు వాటిని నమ్మ వద్దని మంత్రి కోరారు. తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయ అని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
కృష్ణా, గోదావరి జలాల ద్వారా హైదరాబాద్ నగర వాసులకు తాగు నీటిని కల్పించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జనం అష్ట కష్టాలు పడ్డారని, వర్షాలు వస్తే నీట మునిగిన దాఖలాల గురించి చెప్పాల్సి న పని లేదన్నారు.
హైడ్రా సక్రమంగానే పని చేస్తోందని, కానీ దానిని బద్నాం చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్ గౌడ్.