స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – తమ ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో సమగ్ర కుటుంబ సర్వే చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కుల గణనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమకు ఇతర కులాల పట్ల కోపం ఎందుకు ఉంటుందన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
ప్రతిపక్షాలు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందో వారికే తెలియదన్నారు. ప్రజా సంఘాలు లేదా కుల సంఘాలు , మేధావులు, విశ్లేషకులు ఎవరైనా తమ వద్దకు రావచ్చాన్నరు మంత్రి.
అన్ని వివరాలు తెలియ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం కీలక సమావేశం ఉండడం వల్ల తాము మిగతా వివరాలు చెప్పలేక పోతున్నామని అన్నారు పొన్నం ప్రభాకర్.