NEWSTELANGANA

24 వేల బ‌స్సుల‌కు ఫిట్ నెస్ స‌రిఫ్టికెట్లు

Share it with your family & friends

జారీ చేశామ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో పాఠ‌శాల‌ల‌కు సంబంధించి మొత్తం 24 వేల‌కు పైగా బ‌స్సులు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. బుధ‌వారం శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్బంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభానికి నెల ముందు నుండే మే 15 నుండి ఫిట్ నెస్ కు సంబంధించి సర్టిఫికెట్స్ ఇస్తామ‌ని చెప్పారు. ఇది ప్రతి స్కూల్ బస్సులకు తప్పనిసరి చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

స్లాట్ బుక్ చేసుకొని ఆన్ లైన్ లో బస్సులతో పాటు డ్రైవర్లు , అదనపు డ్రైవర్లు ,అటెండర్స్ అందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ప‌ర్ ఫెక్ట్ అయిన తరువాతనే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంద‌ని అన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కింద తీసుకొని బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్రతి బస్సుల్లో ఫైర్ , ఫోన్ నంబర్ డిస్ ప్లే , మెడికల్ కిట్ తప్పనిసరి చేశామ‌న్నారు.

పాఠశాల విద్యార్థుల సమయానికి బస్సులు నడపాలని సభ్యులు సూచించారు.. పాఠశాల ఏరియాల వారీగా బస్సులు నడిపేల కార్యక్రమం తీసుకుంటామ‌న్నారు. బస్సుల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ తో పాటు కఠినంగా వ్యవహరించాల్సి ఉందని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.