ఆర్టీసీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు
నిప్పులు చెరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆర్టీసీపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బుధవారం శాసన సభలో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీని చంపి ఉంటదా తీసేస్తారా అనే పరిస్థితుల్లో రిటైర్డు ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ ని ఎండీ గా పెట్టీ ఆర్టీసి నీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ రాజ్ భవన్ ముందు ధర్నా చేసిన మీరు ఇవాళ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
కార్మిక సంస్థలను రద్దు చేసి ఇవాళ యూనియన్ల గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. మీకు ఏం హక్కు ఉంది..రద్దు చేసిన మీకు పునరుద్ధరణ గురించి మాట్లాడే హక్కు ఉందా. అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
కార్మికులకు ముందు క్షమాపణ చెప్పి అడగండి ..ఆర్టీసి గౌరవ అధ్యక్షులు గా మీరు ,మీ కుటుంబ సభ్యులు ఉండి 50 రోజులు సమ్మె చేసినా, కార్మికులు చనిపోయినా పట్టించు కోలేదన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క బస్సు అయినా కొన్నారా అని ప్రశ్నించారు.
తమ సర్కార్ వచ్చాక ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చామన్నారు. 2013 నుండి పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బాండ్ల బకాయిలు 80 కోట్లు చేల్లించామని తెలిపారు మంత్రి. కార్మికులకు సంబంధించిన పిఎఫ్, సీసీఎస్ నిధులు వాడుకోలేదన్నారు.
4 వేల కోట్ల కార్మికుల డబ్బులను వాడుకున్నది బీఆర్ఎస్ సర్కార్ కాదా అని నిలదీశారు .ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు కేటాయిస్తుందోని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఆర్టీసి లో ప్రయాణం చేశారని తెలిపారు.
2400 కోట్ల రూపాయల మేర ప్రయాణం చేస్తే 2000 కోట్లు ప్రభుత్వం మహ లక్ష్మి ద్వారా ఆర్టీసికి చెల్లించిందన్నారు. చనిపోయిన ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.