మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం
పత్రిక అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ మేరకు కీలకమైన నేతలను ఆహ్వానిస్తోంది. స్వయంగా రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు. ఆయన నివసిస్తున్న ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగా సాదరంగా ఆహ్వానించారు ఎంపీ సంతోష్ రావు. తనను ఆహ్వానించినందుకు ఆనందం వ్యక్తం చేశారు కేసీఆర్. ఇదే సమయంలో పొన్నంతో పాటు వచ్చిన వారందరికీ భోజనం వడ్డించారు స్వయంగా .
కేసీఆర్ ను కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్. తామిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పారు.
కేసీఆర్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం రాజ్ భవన్ దిల్ కుశా గెస్ట్ హౌస్ లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రావాలని కోరారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.