ప్రశంసించిన రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి – ఢిల్లీ వేదికగా తొలిసారిగా జరిగిన ఖో ఖో ప్రపంచ కప్ ను భారత మహిళా, పురుష జట్లు చేజిక్కించుకున్నాయి. ఇరు జట్లు ఫైనల్ లో నేపాల్ జట్లను ఓడించాయి. ఈ సందర్బంగా జట్లను అభినందించారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. దేశం గర్వించేలా అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు. విశ్వ విజేతలుగా నిలవడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
కాగా మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ చారిత్రాత్మక విజయం వారి అసమాన నైపుణ్యం, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ఈ అసాధారణమైన గెలుపు భారతదేశపు పురాతన సాంప్రదాయ క్రీడలలో ఒకదానికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టేలా చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా లెక్కలేనంతమంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు పీఎం. రాబోయే కాలంలో మరింత మంది యువకులు ఈ క్రీడను కొనసాగించడానికి మార్గం సుగమం చేసిందన్నారు.