Monday, April 7, 2025
HomeNEWSANDHRA PRADESHక్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చి దిద్దుతాం

క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చి దిద్దుతాం

ప్ర‌క‌టించిన మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి

ఢిల్లీ – ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. కేంద్ర మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ‌తో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో ప‌ర్య‌టించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చి దిద్దేందుకు అడుగులు వేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో
ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి కేంద్రం మద్ధ‌తు ఇవ్వాల‌ని కోరామ‌న్నారు. అన్నిన‌గ‌రాల‌లో క్రీడా మౌలిక స‌దుపాయాల నిర్మాణం కోసం రూ . 280.9 కోట్ల రూపాయ‌లు కేటాయించాల‌ని విన్న‌వించామ‌న్నారు.

రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు కోసం సహకారం అందించాలని ప్ర‌తిపాదించామ‌న్నారు. జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

ఇప్పటికే అత్యుత్తమ నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరణ వంటి అంశాలు కూటమి ప్రభుత్వం హయంలో జరిగాయని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్, జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

యువతకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో క్రీడా సముదాయం ఏర్పాటు ద్వారా “మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్‌బాల్ ఫీల్డ్, స్విమ్మింగ్ పూల్” వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments