ఏపీ క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
అమరావతి – రాష్ట్రంలో స్టేడియం నిర్మాణాలు, ఆధునీకరణకు నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రెన్నోవేషన్ కోసం రూ. 27.48 కోట్లు మంజూరు చేయాలని విన్నవించామని చెప్పారు. ఖేలో ఇండియా పథకం ద్వారా పలు ప్రాజెక్టులు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేయాలని ఇప్పటికే తెలిపామన్నారు. రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ. 42.62 కోట్ల రూపాయలు సాయంగా ఇవ్వాలని కోరామన్నారు.
రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించినట్లు తెలిపారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మంసుఖ్ మాండవీయకు పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించడం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ లోని కన్హా శాంతివనంలో రెండవ రోజు అట్టహాసంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చింతన్ శివిర్ సమావేశం పాల్గొన్నారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు. ఇటీవల విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.