కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత
కడప : చరిత్రలో నిలిచి పోయేలా మహానాడును నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. ఈ నెల 27, 28, 28 తేదీల్లో కడపలోని పబ్బావరంలో నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సన్నాహాక సమావేశం చేపట్టారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తన ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన మహానాడు కంటే చరిత్రలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కడప మహానాడును నిర్వహించడానికి కడప నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. మూడో రోజుల పాటు నిర్వహించే మహానాడు కోసం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుకుండా రాకపోకలకు వీలుగా రూట్ మ్యాప్ రెడీ చేశామన్నారు. వసతుల వారీగా కమిటీలు నియమించామన్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన నాయకులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ప్రాంతంలో, బీటెక్ రెడ్డి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అనంతపురం, సత్యసాయి జిల్లా టీడీపీ క్యాడర్ కు పులివెందులలో భోజన సదుపాయలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంత నాయకులకు కూడా మూడ్రోజుల పాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామన్నారు.