సీఎం చంద్రబాబు సహకారం గొప్పది
అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి ఎస్ . సవిత. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల అభివృద్ధికి రూ.11.56 కోట్లు మంజూరు చేయడంపై ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ధన్యవాదాలు తెలిపారు.
గత జగన్ ప్రభుత్వం ఎస్టీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల హాస్టళ్లను గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. నా ఎస్సీలు…నా ఎస్టీలు…నా బీసీలు…అంటూ బడుగు బలహీన వర్గాల వారిని జగన్ ఓటు బ్యాంకుగా చూశారే తప్పా ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు సవిత.
ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు చదువు కోవడం జగన్ కు ఇష్టంలేదన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను 5 ఏళ్లపాటు పట్టించు కోలేదన్నారు. చిన్న చిన్న మరమ్మతులకు నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. చివరికి విద్యార్థులకు ఇవ్వాల్సిన డైట్, కాస్మోటిక్ బిల్లులను కూడా చెల్లించలేదన్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల మరమ్మతులకు, విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులను కూడా చెల్లించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యా రంగం అభివృద్దికి మరింత నిధులు తమ ప్రభుత్వం కేటాయించనుందని స్పష్టం చేశారు సవిత.