మంత్రి గుమ్మడి సంధ్యా రాణి షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీ సర్కార్ మహిళలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యా రాణి. ఉచిత బస్సు ప్రయాణంపై మాట మార్చారు. మహిళలకు ఫ్రీగా సౌకర్యం కల్పిస్తామని, కానీ ఆయా జిల్లాల వరకే పరిమితం చేశామన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే టికెట్లు తీసుకోవాల్సిందేనని ప్రకటించారు. దీనిపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోసం చేయడంలో కూటమి సర్కార్ రాటు తేలిందన్నారు.
కూటమి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలువు తీరి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, ఇప్పుడు దాని గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడు మహిళలను లక్షలాధికారులను చేస్తామని నమ్మించారని, తీరా గెలిచాక వారి గురించి పట్టించు కోవడం మానేశారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు కండీషన్స్ అప్లై అంటూ కొత్త రాగం ఎత్తుకోవడం పట్ల సీరియస్ అయ్యారు .