బీజేపీ అధ్యక్ష మార్పుపై చెప్పలేం
జేపీ నడ్డాతో సత్యకుమార్ భేటీ
న్యూఢిల్లీ – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.
ఇందులో ప్రధానంగా ఏపీలో రాజకీయ అంశాలు, స్థానిక ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించారు. జేపీ నడ్డాతో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడారు ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్. త్వరలో జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు ఉండవచ్చని అన్నారు.
అయితే ఏపీ అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీలో ఉన్నట్టు ఏపీలో కూడా మార్పులు ఉంటాయో లేదో తానేమీ ఇప్పుడేమీ చెప్పలేనని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్య శాఖ పరంగా కేంద్రం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా, నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు ఏపీ మంత్రి.