నైపుణ్యం విజయానికి సోపానం – మంత్రి
అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపు
అనంతపురం జిల్లా – నైపుణ్యం అనేది అత్యంత ముఖ్యమని, అది విజయానికి సోపానమని స్పష్టం చేశారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. సోమవారం అనంతపురం పట్టణంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా( బీజేవైఎం) ఆధ్వర్యంలో ‘పీఎం ఇంటర్న్‌షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సత్య కుమార్ యాదవ్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే వివిధ స్కాలర్షిప్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్( పీఎంఈజీపీ), స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తు తీర్చి దిద్దుకోవచ్చని సూచించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, డీడీయూజీకే, స్కిల్సెన్సెస్ వంటివి ఉపయో గ పడతాయని చెప్పారు సత్య కుమార్ యాదవ్.
పీఎం ఇంటర్న్‌షిప్ ఏడాది పాటు తీసుకుంటే చదువు అనంతరం కంపెనీల్లో చేరేందుకు వెయిటేజీగా పరిగణిస్తారని తెలిపారు. భారతీయ యువత మేధో సంపత్తి, తెలివి తేటలు కలిగినవాళ్లు అని కొనియాడారు. ఇన్నోవేషన్ వైపు దృష్టి సారించి, ప్రభుత్వం అందిస్తున్న ప్రోగ్రామ్స్‌ను ఉపయోగించుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దు కోవడంతో పాటు రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు .