NEWSANDHRA PRADESH

భూ నిర్వాసితుల‌కు న్యాయం చేస్తాం

Share it with your family & friends

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ హామీ

అనంత‌పురం జిల్లా – భూములు కోల్పోయిన రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి వద్ద నిర్మిస్తున్న జిల్లేడుబండ రిజర్వాయర్ భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు.

మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , టీడీపీ ధర్మవరం ఇన్​చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ధర్మవరం ఇన్​చార్జ్ చిలకం మధుసూదనరెడ్డితో కలిసి రైతులు, నిర్వాసితులతో మాట్లాడారు మంత్రి. అలాగే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని, కష్టాలను నిర్వాసితులు స‌త్య కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి రైతుల నుంచి ఎలాంటి డిమాండ్​ లేకున్నా జిల్లేడుబండ నిర్మాణానికి తలపెట్టింది గత జగన్ ప్రభుత్వం.

23 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే ఈ ప్రాజెక్టును 2.41 టీఎంసీల సామర్థ్యంతో రూ.680 కోట్లతో మొదలు పెట్టింది. 8 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించాల్సి ఉంది. 2020లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు 2024 డిసెంబర్ కి పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1 కిలోమీటరు కట్ట మాత్రమే పూర్తయ్యింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 3,780 ఎకరాలు కావాలి. ఇందులో 1,050 ఎకరాలు కాల్వల నిర్మాణానికి కాగా, మరో 2,700 ఎకరాలు ముంపు నివారణ కోసం ఉపయోగిస్తారు. అయితే ఒక్క గ్రామసభ కూడా నిర్వహించకుండా రైతులను బెదిరించి దౌర్జన్యంగా ప్రాజెక్టు నిర్మించాలని ప్రయత్నించారని ఆరోపించారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్.

గ్రామాల వారీగా అస్సెస్​మెంట్ చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత మందికి లబ్ధి కలుగుతుంది.. ఎంత మందికి నష్టం వాటిల్లుతుంది అనేది అంచనా వేస్తామ‌న్నారు .