జగన్ ఆస్తులను పేదలకు పంచాలి
ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
2004 తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిస్సిగ్గుగా అక్రమంగా దోచుకున్న తమవి కాని ఆస్తుల పంపకాలపై రగడను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని ఆరోపించారు సత్య కుమార్ యాదవ్.
అన్న నుండి ప్రాణాపాయం ఉందని, రక్షణ కలిగించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్ ను మరిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాధనాన్ని దోచుకునే టెక్నిక్ ను వంట పట్టించుకున్న పార్టీలు ,కుటుంబాలు వ్యక్తులకు సమాజ బహిష్కరణ విధించాలని అన్నారు. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, నిజమైన హక్కుదారులైన కోట్లాది పేద పిల్లలకు పంచాలని డిమాండ్ చేశారు సత్య కుమార్ యాదవ్.
అప్పుడే రాష్ట్ర ప్రజలకు నిజమైన దీపావళి పండుగ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి .