NEWSANDHRA PRADESH

క‌డ‌ప జిల్లా పేరును మార్చాలి – మంత్రి

Share it with your family & friends

సీఎంకు విన్న‌వించిన స‌త్య‌కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మంత్రి లేఖ రాశారు. వైయస్సార్ జిల్లా పేరును ‘వైయస్సాఆర్ కడప జిల్లా’గా మార్చాలని కోరారు.

రాయలసీమలోని కడప జిల్లాకు గొప్ప ఆథ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని తెలిపారు స‌త్య కుమార్ యాద‌వ్. కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం దేవుని కడప అని, ఇక్కడ పర్యటించిన కృపాచార్యులు తిరుమల శ్రీవారి కరుణను పొందారని పేర్కొన్నారు .

అనంతరం కృపాచార్యులు ఈ ప్రాంతానికి కృపావతిగా నామకరణం చేశారని, కృపావ‌తి కురుపగా , కుడపగా తదనంతరం కడపగా ప్రసిద్ధి చెందింద‌ని తెలిపారు. అవగాహనా రాహిత్యంతో గత ప్రభుత్వం వైయస్సాఆర్ జిల్లాగా పేరు మార్చిందని ఆరోపించారు స‌త్య కుమార్ యాద‌వ్.

శ్రీవారి భక్తుల మనస్సులు నొచ్చుకున్నాయ‌ని, కానీ భయంతో తమ అభిప్రాయాల్ని ఆనాడు ఎవరూ వ్యక్తం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ అంశంపై గతంలో తాను శాశన సభలోనూ ప్రస్తావించానని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.