NEWSANDHRA PRADESH

మంత్రి స‌విత ప్ర‌జా ద‌ర్బార్ స‌క్సెస్

Share it with your family & friends

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌నం క్యూ

మంగ‌ళ‌గిరి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు బుధ‌వారం ఏపీ మంత్రి స‌విత మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా బాధితుల నుంచి విన‌తులు స్వీక‌రించారు. అక్క‌డిక‌క్క‌డే మంత్రి వాటిని ప‌రిష్క‌రించారు. మ‌రికొన్నింటిని రెఫ‌ర్ చేశారు పై అధికారుల‌కు.

ఇదిలా ఉండ‌గా ఇవాల్టి నుంచి పార్టీ ఆఫీసులో టీడీపీకి చెందిన మంత్రులు నెలాఖ‌రు వ‌ర‌కు ఉండాల‌ని, ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టాల‌ని ఆదేశించారు పార్టీ చీఫ్‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ కార్య‌క్ర‌మానికి తొలి రోజు మంత్రి స‌విత హాజ‌ర‌య్యారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు క్యూ క‌ట్టారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించారు.

వారి నుండి మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలరని ప్రజలు నమ్మి అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఇది ప్రజల పాలన అని త‌మ‌ నాయకుడు త‌మ‌కు సూచించింది ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని చెప్పార‌ని తెలిపారు మంత్రి స‌విత‌.