మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్
అమరావతి : మంత్రి సవిత నిప్పులు చెరిగారు. జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా అని ప్రశ్నించారు. అధికారంలో 30 ఏళ్లు ఉంటున్నానంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్ అంటూ మండిపడ్డారు. నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. ఏ చర్చకైనా సిద్దమని ప్రకటించారు. ప్రజలను భ్రమలో పెట్టాలని జగన్ భావిస్తున్నారని, ఆయనను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతోందని, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే కొనసాగుతోందని జగన్ అనుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ మాటలను నమ్మేస్థితిలో జనాలు లేరని, రాష్ట్రాభివృద్ధి ఎవరితో సాధ్యమని గ్రహించే ఆయనకు 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని అన్నారు. పరామర్శకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో ఎలా మెలగాలో కూడా తెలియడం లేదని, ఎన్నికల కోడ్ ఉంటుండగా గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్ కు ఎక్కడ ఎలా మెలగాలో కూడా తెలియక పోవడం శోచనీయమన్నారు.
ప్రజా సమస్యలపై మాట్లాడానికి అసెంబ్లీకి రావాలని, కనీసం నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసమైనా సభకు రావాలని జగన్ నుద్దేశించి మంత్రి సవిత కోరారు. ప్రజల కోసం పోరాటం చేయండి…ప్రజా సమస్యలపై మాట్లాడండి తప్పనిసరిగా మైక్ ఇస్తామని మంత్రి వ్యాఖ్యానించారు.