తండ్రికి సీతక్క దండం
నీవు లేకపోతే నేను లేను
హైదరాబాద్ – రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దాసరి అనసూయ అలియాస్ సీతక్క తన తండ్రి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. జూన్ 16న ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా తండ్రుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవాళ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సీతక్క తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు అక్షరాలు రాక పోయినా అక్షరాలు నేర్పించడమే కాదు సంస్కారం, విలువలతో కూడిన జీవితాన్ని ఇచ్చారని కొనియాడారు.
మా నాన్న ఎప్పటికీ తనకు స్పూర్తిగా నిలుస్తూనే ఉంటారని, ఆయన నడిచిన బాట లోనే తాను కూడా నడుస్తున్నానని తెలిపారు సీతక్క. ప్రతి కుటుంబంలో బాధ్యతలను మోస్తూ , తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్ట పడుతున్న కోట్లాది మంది తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు .