టీజీఎఫ్‌సీ తీరుపై సీతక్క ఫైర్
పనితీరు మార్చుకోవాలని ఆదేశం
హైదరాబాద్ – మంత్రి దాసరి సీతక్క సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆహార సంస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్బంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త పరిచారు.
మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత, శుభ్రం లేని సరుకులు సప్లై చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఎవరంటూ, వారి వివరాలు తనకు అందజేయాలని స్పష్టం చేశారు మంత్రి .
ఇదిలా ఉండగా సంబంధిత ఉన్నతాధికారులను వెంటనే సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతంను తయారు చేస్తున్న సంస్థపై ఎంతో బాధ్యత ఉందన్నారు. ముడి సరుకుల్లో లోపం వస్తే సహించమని హెచ్చరించారు.