విద్య తోనే వికాసం – సీతక్క
ప్రభుత్వ బడులు బలోపేతం
ములుగు జిల్లా – రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలను పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరపున పుస్తకాలు పంపిణీ చేశారు.
తమ ప్రభుత్వం విద్యా రంగంపై ఎక్కువగా దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్య తోనే వికాసం అలవడుతుందని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ప్రతి పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించడమే తమ సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు మంత్రి సీతక్క.
ఇక భారత రాజ్యాంగం గనుక లేక పోతే ఇవాళ తాను మంత్రిగా ఉండేదానిని కాదన్నారు. ఈ సందర్బంగా ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ గా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు సీతక్క.