స్పష్టం చేసిన మంత్రి దాసరి సీతక్క
హైదరాబాద్ – మహిళా సంక్షేమం , అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి దాసరి సీతక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో. ఈ సందర్బంగా పాల్గొన్న మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం అనేక పథకాలను , కార్యక్రమాలను తీసుకు వచ్చిన ఘనత తమ సర్కార్ కు దక్కుతుందన్నారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను తీసుకు వస్తామన్నారు సీతక్క.
రాష్ట్రంలోని మహిళా సంఘాలు అద్భుతంగా పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరారు. తమ ప్రభుత్వం ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేసేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదన్నారు. అంతే కాకుండా మహిళా సంఘాలతో 150 బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు. సర్కారే వారికి గ్యారెంటీగా ఉంటోందన్నారు సీతక్క.