బీఆర్ఎస్ దుష్ప్రచారం సీతక్క ఆగ్రహం
దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై స్పందన
హైదరాబాద్ – రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై భగ్గుమన్నారు . ఆమె సచివాలయంలో తన ఛాంబర్ లో విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మీరే అనుమతి ఇచ్చి తమపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం , ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచి పద్దతి కాదన్నారు. దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని, ఆ విషయం మరిచి పోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు సీతక్క. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో అనుమతులు ఇచ్చినట్లుగా ఎలాంటి సంబంధం లేని విషయంలో బీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
రైతులను ముంచాలని చూసిందే కేసీఆర్, కేటీఆర్ అని మండిపడ్డారు సీతక్క. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.