బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి
మంత్రి దాసరి సీతక్క షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – మంత్రి దాసరి సీతక్క నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పై భగ్గుమన్నారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అంటూ ఎద్దేవా చేశారు. మాజీ సర్పంచ్ ల కు సంబంధించిన పెండింగ్ బిల్లులను తమకు వారసత్వంగా ఇచ్చారంటూ మండిపడ్డారు.
ఏనాడూ వారి సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు వారి బిల్లులు తమ మెడకు చుట్టుకున్నాయంటూ ఫైర్ అయ్యారు. గత 2014 నుంచి పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు.
ఆరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒక్క సంతకం పెట్టి ఉంటే అన్నీ క్లియర్ అయ్యేవన్నారు దాసరి సీతక్క. కావాలని రిలీజ్ చేయకుండా అడ్డుకున్నది కాక ఇవాళ అసెంబ్లీలో మాజీ సర్పంచ్ ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి.
తెలంగాణ పేరుతో రాష్ట్ర అభివృద్దిని పక్కన పెట్టారని, మరో వైపు విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసింది మీరు కాదా అని నిలదీశారు దాసరి సీతక్క.