అబద్దాలు చెప్పడంలో మీరే దిట్ట
హైదరాబాద్ – మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై భగ్గుమన్నారు. అబద్దాలను నిజం చేయడంలో కల్వకుంట్ల కుటుంబం ఆరి తేరిందన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను అధికారం పేరుతో దోచుకున్నది చాలక ఇప్పుడు తమపై అభాండాలు వేయడం దారుణమన్నారు. మీలాగా రాత్రికి రాత్రే మహిళలు కోటీశ్వరులు కాలేరన్నారు. మహిళలను అన్ని రంగాలలో పైకి తీసుకు రావాలన్నదే తమ సర్కార్ లక్ష్యమన్నారు సీతక్క. వారికి ఉపాధి కల్పిస్తున్నాం, బిజినెస్ పెట్టిస్తున్నాం, లోన్లు ఇప్పిస్తున్నాం అన్నారు.
మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు తన శాఖకు చెందిన హెల్ప్ లైన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిని విస్తు పోయేలా చేశారు. వచ్చిన ఫోన్ ను తానే స్వయంగా ఎత్తారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. ఈ సందర్బంగా హరీశ్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవితలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారికి ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పెడితే రికార్డింగ్ డాన్సులు వేసుకోమనడం దారుణమన్నారు. మహళల గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు .