Sunday, April 20, 2025
HomeNEWSకోలుకుంటున్న శ్రీ‌తేజ్

కోలుకుంటున్న శ్రీ‌తేజ్

వెల్ల‌డించిన మంత్రి సీత‌క్క

హైద‌రాబాద్ – పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా జ‌రిగిన తొక్కిస‌లాటలో తీవ్రంగా గాయ‌ప‌డి ప్ర‌స్తుతం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. డాక్ట‌ర్ల‌తో మాట్లాడి ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆరా తీశారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం మరింత మెరుగు ప‌డింద‌న్నారు. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడని అన్నారు. త‌న కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించామ‌న్నారు. శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామ‌ని చెప్పారు. బాధితుడిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం మంత్రి సీత‌క్క మీడియాతో మాట్లాడారు.

శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నామ‌ని చెప్పారు. ఎంత ఖ‌ర్చు అయినా స‌రే తాము భ‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో అల్లు అర్జున్ రూ. 50 ల‌క్ష‌లు, మైత్రీ మూవీ మేక‌ర్స్ రూ. 50 ల‌క్ష‌లు, మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌ర‌పు నుంచి రూ. కోటి మొత్తం క‌లిపి రూ. 2 కోట్లు సాయంగా ఇచ్చార‌ని వెల్ల‌డించారు మంత్రి .

RELATED ARTICLES

Most Popular

Recent Comments