అమెజాన్ కంపెనీతో చర్చలు సఫలం
స్పష్టం చేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
అమెరికా – ప్రముఖ దిగ్గజ కంపెనీ అమెజాన్ తో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని చెప్పారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన యుఎస్ఏలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన లాజిస్టిక్ కంపెనీ అయిన అమెజాన్ ఇంక్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ , ఏఐ ఆధారిత డేటా సెంటర్ పై ఎక్కువగా చర్చ జరిగిందన్నారు శ్రీధర్ బాబు. ఇప్పటికే కంపెనీ హైదరాబాద్ లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసిందన్నారు. మరింత విస్తరించేందుకు గాను ఒప్పుకుందన్నారు మంత్రి.
అంతే కాకుండా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ హామీ ఇచ్చారని చెప్పారు శ్రీధర్ బాబు. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించన విషయాన్ని గుర్తు చేశారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదారాబాద్ లో ఇప్పటికే మూడు డేటా సెంటర్లు పని చేస్తుండడం విశేషం.