Saturday, May 24, 2025
HomeNEWSఆ భూములు యూనివ‌ర్శిటీవి కానే కావు

ఆ భూములు యూనివ‌ర్శిటీవి కానే కావు

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ – మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ విద్యార్థులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంపై ఫైర్ అయ్యారు. కంచె గ‌చ్చి బౌలి లోని స‌ర్వే నెంబ‌ర్ 25 లోని 400 ఎక‌రాల భూమి త‌మ‌దేనంటూ రేవంత్ రెడ్డి స‌ర్కార్ అంటోంది. ఈ భూముల వేలానికి సిద్ద‌మైంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి ప్ర‌తిప‌క్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ , సీపీఎం. ప‌లువురు విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వ స‌ర్వేలో కూడా స‌ర్కార్ వేనంటూ తేలింద‌న్నారు మంత్రి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రీధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ భూముల‌న్నీ ముమ్మాటికీ ప్ర‌భుత్వ ఆస్తి అంటూ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది వారికి తగదు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి కి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదన్నారు.

ఇప్పటీ వరకు ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పట్టించు కోలేదన్నారు. ఇప్పుడేమో పని గట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments