చంద్రశేఖరన్ కు టీజీ భరత్ కితాబు
ఆయన విజనరీ లీడర్ అంటూ ప్రశంస
అమరావతి – ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్ సంస్థల కార్య నిర్వాహక చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను మంత్రులు నారా లోకేష్ , టీజీ భరత్ కలుసుకున్నారు.
ఈ సందర్బంగా చంద్రశేఖరన్ తో జరిపిన సంభాషణ, ఐటీ, ఇతర రంగాలపై ఆయనకు ఉన్న పట్టు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు టీజీ భరత్. కలిసిన ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయం తాను నేర్చుకుంటానని ఇది తనకు ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
అందుకే ఆయన అతి పెద్ద గ్రూప్ సంస్థకు చైర్మన్ గా ఉన్నారని తెలిపారు. రతన్ టాటా లేక పోవడం బాధాకరమని, కానీ ఆయన వారసత్వాన్ని చంద్రశేఖరన్ కొనసాగిస్తారని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు టీజీ భరత్.
టాటా సన్స్ ఛైర్మన్‌ని కలవడం అనేది ఎల్లప్పుడూ బహుమతినిచ్చే అనుభవం అన్నారు. తాము కనెక్ట్ అయిన ప్రతిసారీ, విలువైన, స్ఫూర్తిదాయకమైన తాజా అంతర్దృష్టులు, దృక్కోణాలను తాను పొందుతానని అన్నారు.
ఆయనకు ఉన్న జ్ఞానం తనను ఎంతగానో ఆశ్చర్య పోయేలా చేస్తుందన్నారు. తన కోసమే కాకుండా ఇతరులకు కూడా ఆయన స్పూర్తి దాయకంగా ఉంటారని ప్రశంసించారు టీజీ భరత్.