వరద బాధితులకు టీజీ భరత్ భరోసా
నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మంత్రి
విజయవాడ – ఏపీ ఇంకా వరదల్లోనే ఉంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాయం కోసం ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో మంత్రులంతా తమ కాళ్లకు పని చెప్పారు. సహాయక చర్యలలో స్వయంగా పాల్గొంటున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు తమ తమ ప్రాంతాలలోనే మకాం వేశారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్.
ఊర్మిళా నగర్లో వరద బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నుండి మంత్రి టి.జి భరత్ ఆధ్వర్యంలో 8 వేల నిత్యావసర కిట్లు తీసుకొచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు.
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలతో కలిసి వరద బాధితుల ఇంటికెళ్లి మాట్లాడారు టి.జి భరత్. ప్రజల కష్టాలు తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరదలు రావడం ఎంతో బాధాకరమని ఆవేదన చెందారు.
కష్ట సమయాల్లో ప్రజలను రక్షించడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.