రైతు బంధు కింద రూ. 80 వేల కోట్లు
పంపిణీ చేశామన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్ – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పూర్తిగా నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు.
శనివారం జరిగిన శాసన సభ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా రైతు బంధు ఇవ్వడం లేదని మాట్లాడే వారికి సూటిగా ప్రశ్నించారు. తాము ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 80,000 కోట్లు జమ చేశామని చెప్పారు. వీటికి సంబంధించి తమ వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.
కావాలంటే ప్రతి సభ్యుడికి వివరాలు అందజేస్తామన్నారు. సరి చూసుకోవచ్చని తెలిపారు. అనవసర కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించారు తుమ్మల నాగేశ్వర్ రావు. తాము అధికారంలోకి వచ్చాక 7 వేల కోట్లు ఇచ్చామన్నారు..21,283 కోట్లు సాగు చేయని భూమికి కూడా బెనిఫిట్ జరిగిందని తెలిపారు.
సాగు చేసే భూమికే.. రైతు బంధు ఇవ్వాలని జీవో ఉందని స్పష్టం చేశారు. రైతుబంధు లోపాలు సరిదిద్ది.. సాగు చేసే రైతుకు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు తుమ్మల .