మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
తొలి విడతగా 12500 టన్నుల బియ్యం పంపిస్తున్నామని అన్నారు . ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం పంపిణీ కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు.
ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేయడానికి రాష్ట్ర సర్కార్ ఒప్పందం చేసుకున్నదని తెలిపారు. ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా పోర్టు నుంచి షిప్ ద్వారా లోడింగ్ చేయడం జరిగిందన్నారు. ఫిలిప్పీన్స్ కి బియ్యం లోడ్ తో వెళ్తున్న షిప్ ను జాతీయ జెండా ఊపి ప్రారంభించామన్నారు. బియ్యాన్ని ట్రంగ్ ఎన్ నౌక ద్వారా పంపిస్తున్నట్లు చెప్పారు. దశల వారీగా మొత్తం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తామని స్పష్టం చేవారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.